“జాతి బిడ్డా మేలుకో – ఉజ్వల భవితను ఏలుకో” అంటూ ఐక్యతకు పిలుపు

జిల్లా అధ్యక్షుడు గోవింద్ శేఖర్ ఆధ్వర్యంలో మహాసభకు భారీగా తరలిన జిల్లా నాయకులు

పయనించే సూర్యుడు జులై 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ చాకలి కుల బాంధవుల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న చాకలి ఎస్సీ సాధన సమితి 9వ వార్షికోత్సవ మహాసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ అక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి చాకలి కులస్థులు, సమితి నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ శేఖర్ నేతృత్వంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సభ్యులు, నాయకులు, కుల బాంధవులు భారీగా మహాసభకు తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. “జాతి బిడ్డా మేలుకో – ఉజ్వల భవితను ఏలుకో” అనే నినాదంతో చాకలి జాతి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ అక్క, జిల్లా అధ్యక్షుడు గోవింద్ శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో గోవిందు కృష్ణయ్య గోవిందు శంకర్ గోవిందు కాశన్న గోవిందు యాదగిరి గోవిందు బక్కన్న గురుస్వామి కొండయ్య కొట్ర నాగరాజు సంతు నరసింహ తదితరులు తరలి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *