రామకృష్ణాపురంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

పయనించే సూర్యుడు జులై 08, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ (ఎమ్మార్పీఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి రవీంద్ర మాదిగ ఆధ్వర్యంలో, మండల నాయకులు చిర్రా ఉపేందర్, చాట్ల రాజేష్, ఏర్పల హరికృష్ణ, కుక్కల దిలీప్, గంధం జగజ్జీవన్ రావు, కట్ట వెంకటేశ్వర్లు, జాన్ రాజ్ నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతకాని మండలంలోని మొత్తం 20 గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించి, సంస్థ ఆశయాలు, సామాజిక న్యాయం కోసం కొనసాగుతున్న ఉద్యమాలపై నాయకులు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ స్థాపనతో మాదిగల హక్కుల సాధనకు ఉద్యమానికి కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉపేందర్, హరికృష్ణ, రాజేష్, శ్రీకాంత్, ప్రవీణ్, శంకర్, జాన్ రాజ్, మధు, లవ కుమార్, అబ్రహం, విజయ్, శ్రీనాథ్, రాంబాబు, పుల్లారావు, కిషోర్‌తో పాటు వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *