ప్రత్తిపాడు దస్తావేజు లేఖర్లు మోకాళ్లపై నిలబడి నిరసన

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 08 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌ డౌన్‌ కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది.మంగళవారం దస్తావేజు లేఖర్లు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2వ రోజు కూడా లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.396 జీఓను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెంబర్‌ 396తో తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రైవేట్‌ రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ద్వారా జరిగే ప్రతి దస్తావేజు లావాదేవీపై రూ.2,000 అదనపు రుసుము వసూలు చేయనున్నారు.ఇది నేరుగా సామాన్య,మధ్యతరగతి ప్రజల పై భారం పడుతుందన్నారు.తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు పంచదార్ల నాగేశ్వరరావు,ఉప అధ్యక్షుడు అత్తి ఉమా మహేశ్వరరావు,సభ్యులు,ఇర్లంకి రాంబాబు,చిలకమర్తి రమణ, మదినీ వెంకన్న దొర,ఆర్‌.హనుమంతరావు,ఎస్‌ బాబ్జీ, కె లక్ష్మణ్, పి రాంబాబు,ఏ దొర, పి మణికంఠ,దొంగర రాంబాబు, ఎస్‌ రమణ, ఎన్‌ వెంకట్రావు,గళ్లా మధు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *