ముందస్తు అడ్మిషన్స్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ను సిజ్ చేయాలి.

ప్రభుత్వ అనుమతులు రాకముందే స్కూల్లు ఏర్పాటు చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.ఆర్ పి ఎస్ ఎఫ్, పి ఆర్ ఎస్ వై ఎఫ్.

పయనించే సూర్యుడు మే 24 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఎమ్మిగనూరు పట్టణం లో ప్రభుత్వం నిబంధనలు కు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులలో ఎటువంటి అడ్మిషన్స్ చేసుకోకూడదు అని జీవో ఇచ్చిన కూడా ఎమ్మిగనూరు లో మాత్రం నిబంధనలు బేఖతార్ చేస్తూ ముందుస్తూ అడ్మిషన్స్ చేసుకోవడమే కాకుండా డొనేషన్స్ రూపంలో వేల రూపాయలు ను తల్లితండ్రులు నుంచి నిలువ దోపిడీ చేస్తున్నారు. అలాగే స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కి అడ్మిషన్స్ టార్గెట్ లు ఇచ్చి అవి పూర్తి చేయాలి అని లేనిపక్షం లో ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీచర్స్లకు స్కూల్ యాజమాన్యలు వేధిస్తున్నారు. ఇంకా కొన్ని స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు రాకున్నా అప్పుడే స్కూల్స్ ని ఏర్పాటు చేసి రంగు రంగుల కరపత్రలు పంచుతు విద్యార్థులును మరియు తల్లితండ్రులు ను మోసం చేస్తున్నారు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి అయినా విద్య శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వం నిబంధనలు ను పాటించని స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకోని సిజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రత్యక్షంగా స్కూళ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నాయకులు నర్సింహా నాయుడు, బాబా,మహబూబ్, లక్ష్మన్న, షైక్ష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *