యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం

జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ మే 24/26 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి, సన్నాలకు బోనస్ ప్రకటించి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని కొనకుండా రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ అన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధి నర్సాపురంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 2000 బస్తాల వరి ధాన్యాన్ని రైతులు మద్దతు ధర లభిస్తుందని ఆశతో తీసుకువస్తే అధికారులు అనేక రకాల నాణ్యత ప్రమాణాలు పరీక్షలు నిర్వహించి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వదిలేసారని తెలిపారు అకాల వర్షాల భయంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేట్ వ్యక్తులకు బస్తా 1300 చొప్పున నష్టాలకు అమ్మవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 కామన్ గ్రేడ్ కు 2359 మద్దతు ధరతో పాటు సన్నాలకు 500 బోనస్ అంటూ ప్రకటనలతో రైతులను ప్రలోభ పెట్టి ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు ఎద్దేడ్చిన ఎగుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదని, ఇకనైనా ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతతో నిజాయితీగా వ్యవహరించాలని ఉసికల రమేష్ కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *