వానరం కరచి బాలికకు గాయాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 24.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ// వానరం కరిచి బాలిక గాయపడ్డ సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది బాధితురాలు కథనం మేరకు… పెద్దపంజాణి మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లింగమనయపల్లికి చెందిన శ్రావణి గ్రామస్తులతో కలిసి చౌడేపల్లి మండలం దొనపల్లికి టమాట కాయలు కోసేందుకు వచ్చింది ఈ క్రమంలో ఇంటికి బయలుదేరి వస్తుండగా ఒక వానరం ఆటోలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది ఈ దాడిలో శ్రావణి కి గాయాలయ్యాయి గాయపడ్డ బాలికను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ప్రధమ చికిత్స అనంతరం వైద్యులు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *