ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్లీన్ స్వీప్ కార్యక్రమం

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 27 5 2026 తేదీన మొదటి వారంలో మెయిన్ రోడ్స్ డివైడర్స్ పెయింటింగ్ వేయించడం జరిగింది పట్టణాన్ని సుందరంగా ఉండేందుకు మునిసిపల్ మెయిన్ రోడ్డు శ్రీనివాస భవన్ రోడ్డు డిఎస్పి బంగ్లా రోడ్డు నందు డివైడర్లకు బ్యూటిఫికేషన్ పెయింటింగ్ వేయించడం జరిగినది మరియు పలు వార్డుల్లో క్లీన్ స్వీప్ ప్రోగ్రాం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిఎంఎ నయీమ్ అహ్మద్ మరియు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్ కుమార్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది అలాగే ఆదోని పుర ప్రజలు ప్లాస్టిక్ ను వాడకూడదని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో భాగస్వాములు అవ్వాలని కమిషనర్ పిలుపునివ్వడం జరిగినది అలాగే బక్రీద్ పండుగ సందర్భంగా వధించిన పశువుల వ్యర్థాలు ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా పలు వార్డుల్లో మదర్ సా వారికందరికీ సంచులను పంచి పెట్టారు .ఈ విధంగా పరిశుభ్రత పట్ల చొరవ చూపిస్తున్న కమిషనర్ మరియు హెల్త్ ఆఫీసర్ పట్ల ఆదోని పుర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *