
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీలో సోమవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తోట వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తోట వెంకటమ్మ, ఉప సర్పంచ్ సంగీత వీర్రాజు అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమన్న శివశంకర ప్రసాద్, వార్డు సభ్యులు గడ్డం మంగరాజు, దాది వెంకటేశ్వరరావు, పసుపులేటి నాగమణి, గణప వెంకటలక్ష్మి, తోట వెంకటస్వామి, రేషన్ సేల్స్‌మెన్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.