25 ఏళ్ల సేవలకు గుర్తింపుగా సత్కారం

🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 2 బోధన్ :నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ట్రాస్మా ఆధ్వర్యంలో విద్యా ప్రదాత పురస్కార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష సేవలందిస్తూ విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న కరస్పాండెంట్లను ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఫాస్ట్ వైస్ ఛాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొడాలి కృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా విద్యారంగానికి విశేష సేవలందిస్తూ విద్యాసంస్థలను విజయవంతంగా నడిపిస్తున్న నిర్వాహకుల కృషి అభినందనీయమని కొనియాడారు విద్యాభివృద్ధిలో ప్రైవేట్ విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు పాపిరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు వివిధ విద్యాసంస్థల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *