‘జనతా వారధి’తో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం – అమలాపురంలో కార్యక్రమం జయప్రదం

పయనించే సూర్యుడు మే 30 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కారం చూపే లక్ష్యంతో బీజేపీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ చేపట్టిన ‘జనతా వారధి’ కార్యక్రమం శుక్రవారం అమలాపురం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ చీకరమెల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలురి సత్యనందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి స్పందన ఇప్పించారు. పలు పెండింగ్ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ దాట్ల వెంకట సుబ్బరాజు, అమలాపురం టౌన్ అధ్యక్షుడు అయ్యాల భాస్కరావు, పి.గన్నవరం మండల అధ్యక్షులు తిక్కా సత్యనారాయణ, అంబాజీపేట మండల అధ్యక్షుడు కురసా ఆంజనేయులు, ఆరిగెల తేజ వెంకటష్, బండి శ్రీనివాస్, కొత్తపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోల్లకోటి వెంకటేశ్వరావు, జంగా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *