జర్నలిస్టుల బస్ పాస్‌ల గడువు 16.06.2026 వరకు పొడిగింపు

పయనించే సూర్యుడు న్యూస్ :మే 31,తల్లాడ రిపోర్టర్ తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ జి. ముకుంద రెడ్డి ఉత్తర్వుల మేరకు, రాష్ట్రంలోని జర్నలిస్టులకు జారీ చేసిన బస్ పాస్‌ల చెల్లుబాటు గడువును 16 జూన్ 2026 వరకు పొడిగించారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును కూడా ఇదే తేదీ వరకు పొడిగించినందున, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్ట్ బస్ పాస్‌లను ఈ నెల 16 వరకు చెల్లుబాటు అయ్యేలా పరిగణించాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆ శాఖ కోరింది. ఈ మేరకు లేఖ నెం. 003491/యం ఆర్ /2024, తేదీ 29.05.2026 జారీ చేయబడింది. ఇందులో కాపీని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్, మల్టీ జోన్-I & II ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, రాష్ట్రంలోని అన్ని జిల్లా పౌర సంబంధాల అధికారులకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *