తెలంగాణ అభివృద్ధి స్ఫూర్తికి ప్రతీకగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీడీవో కథలప్ప

పయనించే సూర్యుడు జూన్ 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మండల పరిధిలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలితాలను వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొంటూ వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) మునిరుద్దీన్, డిప్యూటీ ఎమ్మార్వో రవికుమార్, మహిళా మండలి సమాఖ్య ఏపీఎం ఈశ్వర్, ఏపీవో మల్లికార్జున్‌తో పాటు వివిధ శాఖల మండల సీసీలు శంకర్ లక్ష్మణ్ రాములు గోపాల్ కళావతి అకౌంటెంట్ స్వరూప కంప్యూటర్ ఆపరేటర్ స్వామి అధికారులు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *