భూమిలో 365 రోజులు నిరంతర పంటలు సాగు చేయాలి

పయనించే సూర్యుడు జూన్ 6 బద్వేల్ నియోజకవర్గం రిపోర్టర్ ఓ జయ ప్రసాద్ నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం శంకవరం గ్రామంలో శుక్రవారం కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ డి పి యం ఆఫీస్ నుండి విచ్చేసిన యన్ యఫ్ ఏ రాజ్ కుమార్ హాజరై శంకవరంలో వట్టి రత్నమ్మ అనే రైతు పొలంలో ప్రధాన పంట వేసే ముందు పి ఎం డి ఎస్ లో వేయబోవు విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలను విత్తన గుళికలుగా మార్చి తయారుచేసి భూమిలో చల్లడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఏ రాజుకుమార్ మాట్లాడుతూ భూమిలో విత్తనాలను ఈ విధంగా తయారు చేసుకొని చల్లడం ద్వారా తక్కువ వర్షం పడిన కూడా విత్తనాలు మొలకెత్తగలవని ఏలినినో ప్రభావం తో భూమిలో ఉన్న సూక్ష్మజీవులు వానపాములు అంతరించి పోకుండా భూమిలో 365 రోజులు నిరంతర పంటలు సాగు విధానం చేపట్టడం ద్వారా భూమిని కాపాడి మంచి దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటి శ్రీనివాస్ ఐ సి ఆర్ పి లు శ్రీలేఖ రత్నమ్మ నారాయణమ్మ రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *