ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 06 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ విజయబాబు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా విజయవ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కను నాటి భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ సంఘ సభ్యులు మాజీ కౌన్సిలర్ అలమండ చలమయ్య, అనుసూరి నాగేశ్వరరావు, నర్ల చిదంబరం, తురోతు గురవయ్య, గొల్లపూడి గణేష్, మల్రెడ్డి సూరిబాబు, బూడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *