బోయపాలెంలో అంగన్వాడీ పిలుస్తోంది రండి

పయనించే సూర్యుడు-12-06-2026-రాజంపేట న్యూస్ : మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో, ఐదేళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు శివరంజని ,అమరావతి, ప్రసన్న లక్ష్మీ పేర్కొన్నారు. రాజంపేట పట్టణ కేంద్రలోని బోయపాలెం అంగన్వాడీ పరిసర ప్రాంతాలలో పర్యటించి మూడు సంవత్సరాలు పైబడిన విద్యార్థిని, విద్యార్థులను అంగన్వాడీలో చేర్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్టు వారు తెలిపారు. గురువారం `అంగన్వాడి పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులను తమ అంగన్వాడి కేంద్రంలో చేర్పించుకున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయడానికి సహకరించి చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు తమ కేంద్రంలో చేర్పించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *