రైతు సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా ట్రై సైకిల్ అందజేత కార్యక్రమం

పయనించే సూర్యుడు: జూన్: 14/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు రైతు సంక్షేమనిధి ట్రస్ట్ ద్వారా గోగులమూడి వెంకటరెడ్డి కి ట్రైసైకిల్ అందజేసిన టీ జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు సత్తుపల్లి: రైతు సంక్షేమనిధి ట్రస్ట్ ద్వారా రెజెర్ల గ్రామానికి చెందిన గోగులమూడి వెంకటరెడ్డి కి ట్రైసైకిల్‌ను టి జి ఐ డి సి చైర్మన్ మువ్వా విజయబాబు అందజేశారు. ఈ సందర్భంగా మువ్వా విజయబాబు మాట్లాడుతూ, దివ్యాంగులకు అండగా నిలిచి వారి జీవనోపాధికి తోడ్పడే ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ట్రైసైకిల్ అందించడం ద్వారా వారి దైనందిన జీవనంలో కొంత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మువ్వా విజయబాబు అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *