ఎడ్లపాడు గ్రామం 94వ బూత్‌లో ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమం వేగవంతం

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 05 యడ్లపాడు మండల ప్రతినిధి.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు గ్రామంలోని 94వ బూత్ పరిధిలో సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులు, చిరునామా సవరణలు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్‌ఏలు) బండ్ల సాంబయ్య, అశోక్, ప్రియనాథ్ పాల్గొని గ్రామ ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అవసరమైన సవరణలు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా నమోదై ఉండేలా గ్రామ ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరుతూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే బీఎల్‌ఏలను సంప్రదించాలని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొని ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *