గుడ్లనర్వలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించిన సర్పంచ్ లేట్ల బాలస్వామి

పయనించే సూర్యుడు జులై 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని గుడ్లనర్వ గ్రామంలో గురువారం నాడు ఎస్ఐఆర్ (SIR) సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగింది. గ్రామంలో జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజల వివరాలను అడిగి తెలుసుకుంటూ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ​ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) మరియు 102 బూత్ బీఎల్ఎ అతినారపు సంజీవ, వీఎల్ఓ మేకల శివశంకర్ పాల్గొని ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ​సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ దాసరి శివ, 5వ వార్డు సభ్యుడు భీమని రాజు, శ్రీనివాసులు, శివశంకర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఈ సర్వే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *