పయనించే సూర్యుడు జూలై 10, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కుమారులు కోటం ప్రకాశం కోటం ప్రభుదాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి 19 82లో మరణించారని, అలాగే 2011లో మా తల్లి అయిన శకుంతలమ్మ మరణించారని వారి మరణాన్ని గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ అప్పటినుండి ప్రతి సంవత్సరం వస్త్రాలు, భోజనాలు అందించడం జరుగుతుందని అలాగే మా కుటుంబంలో అందరూ దేశానికి సేవ చేసే పోలీసులుగా పని చేశారని తెలిపారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ సాదు రావు శకుంతలమ్మ దంపతులు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలానే పేదలకు సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా బాలయోగి , మహాలక్ష్మి ,బడుగు అప్పన్న, చంటి, రాయుడు సూరిబాబు సత్యవతి, హేమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.