సమస్యలు తక్షణ పరిష్కారానికి కృషి.. నూతనంగా కాకినాడ రూరల్ తాసిల్దార్గా బాధ్యతలు తీసుకున్న ఎస్ పోతురాజు..

పయనించే సూర్యుడు జూలై 10, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వెస్ట్ గోదావరి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఎస్. పోతురాజు పదోన్నతి పొంది కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన కాకినాడ రూరల్ మండల తహసీల్దార్‌గా ఈ రోజు బాధ్యతలు పరిపాలనా అనుభవం కలిగిన ఎస్. పోతురాజు రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉందని సహచర అధికారులు పేర్కొంటున్నారు. భూ సమస్యలు, ఆదాయ, కుల, నివాస ధృవపత్రాలు, రెవెన్యూ సంబంధిత ఇతర సేవల పరిష్కారంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందే అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలంలో రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, భూ వివాదాల పరిష్కారం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎస్. పోతురాజు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *