పాలెంలో నులిపురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన

ఈనెల 13న ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి: హెల్త్ అసిస్టెంట్ కూన గోవర్ధన్

పయనించే సూర్యుడు జులై 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 13న ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని హెల్త్ అసిస్టెంట్ కూన గోవర్ధన్ సూచించారు. నులిపురుగులు వ్యాప్తి చెందే కారణాలు, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. పరిశుభ్రత పాటించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం, పాదరక్షలు ధరించడం, శుభ్రమైన నీరు తాగడం, కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి వాడడం, బహిరంగ మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లు ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సరస్వతి, ఆశా కార్యకర్తలు పార్వతి, షమీం, విజయలీల, జయమ్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనుద్దీన్, ఉపాధ్యాయులు పూర్ణ, చంద్రకళ, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ స్వామి, జూనియర్ లెక్చరర్లు నరసింహ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *