ప్రజానాయకుడు రంగా సేవలు చిరస్మరణీయం: సామినేని వెంకట కృష్ణ ప్రసాద్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 5 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న శ్రీ కృష్ణ దేవరాయ సేవాసమితి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం, కోదాడ రోడ్డులోని స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి జనసేన పార్టీ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ కృష్ణ దేవరాయ సేవాసమితి సభ్యులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన ప్రజానాయకుడని, ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాల ద్వారా రంగా సేవలను స్మరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షులు కామిశెట్టి అమర్నాధ్ , ప్రధాన కార్యదర్శి గుంటక లక్ష్మీ నారాయణ , కోశాధికారి యర్రపోతు వెంకటేశ్వరరావు , గౌరవ అధ్యక్షులు గుత్తి విజయభాస్కర్ , ఉపాధ్యక్షులు కొలగాని రాము , ముత్యాల శ్రీనివాసరావు , జాయింట్ సెక్రటరీ పూల నాగరాజు , మహిళా కార్యదర్శులు, రంగా అభిమానులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *