బదిలీపై వెళ్తున్న కార్యదర్శి కి ఆత్మీయ వీడ్కోలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 07 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని వడ్డెర కాలనీ ( శివాజీ నగర్) గ్రామం నుండి బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి వెల్ది దివ్య జ్యోతికి సోమవారం సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్, పాలకవర్గం, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అమీర్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్, గ్రామస్తులు మాట్లాడుతూ దివ్య జ్యోతి గ్రామ అభివృద్ధికి చేసిన కృషి ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.నూతన పంచాయతీ కార్యదర్శి అమీర్ ను గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్, ఉప సర్పంచ్ బోదాసు రాజేష్, వార్డు సభ్యులు బోదాసు లక్ష్మి, వెంకటి, సూర మాధురి, మురళి, పల్లపు అశోక్, బోదాసు రాజేశ్వరి, రాజారెడ్డి, పల్లపు వెంకట్, బోదాసు వెంకవ్వ, రాజయ్య, బోదాసు లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు బేతి మోహన్, ఉపాధ్యాయులు నవ్యశ్రీ, కారోబార్ జలంధర్, అంగన్వాడీ బియ్యని సుజాత, ఆశవర్కర్ సుమలత, గ్రామ పెద్దలు అల్లెపు గంగాధర్, దేవల్ల నర్సయ్య,వివోఏ రోజా, మహిళా సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *