సింగరేణి మండలంలో బీఆర్ఎస్ నేత మనిషా లక్ష్మి మదన్‌లాల్ పర్యటన

పెద్దమ్మతల్లి దర్శనం.. గాయపడిన కార్యకర్తను పరామర్శించిన నాయకురాలు

పయనించే సూర్యుడు న్యూస్ | జులై 7 సింగరేణి రిపోర్టర్ నరేష్ బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి మదన్‌లాల్ సోమవారం సింగరేణి మండలంలో పర్యటించారు. ముందుగా కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మ గుడి 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం విద్యావారిగూడెంకు వెళ్లిన ఆమె, బీఆర్ఎస్ పార్టీ అభిమాని తిరగల్ల మల్లికార్జున్ ఇటీవల కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వాంకుడు జగన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డొంకిన రవీందర్, జుంకీలాల్, గడ్డం వెంకటేశ్వర్లు, పేరిణి వెంకటేశ్వర్లు, ఉద్యమకారుడు సోమందుల నాగరాజు, బీఆర్ఎస్ యువజన నాయకులు జడల కళ్యాణ్, తెలగర్ల రామారావు, భూక్యా మధు, పొడుగు హరీష్, మద్దెల హరీష్, మద్దెల వెంకటేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *