ముత్యాలమ్మ ఆలయ పూజారి రాజారావును పరామర్శించిన సర్పంచ్ గుగులోతు కిషోర్ శివరాం నాయక్

పయనించే సూర్యుడు, మే 22, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేజర్ గ్రామపంచాయతీ ముత్యాలమ్మ గుడి ఆలయ పూజారి రాజారావు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి రామారావును ను పరామర్శించి ధైర్యం కల్పించిన సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది భక్తులకు సేవా దృక్పథంతో ఆశీర్వాదాలు అందించిన రాజారావు అనారోగ్యానికి గురవటం చాలా బాధాకరం అన్నారు . వారు తొందరగా కోలుకొని యధావిధిగా ఆలయ సేవలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు వారికి వారి కుటుంబానికి తాను తన పాలకవర్గం సభ్యులు అండగా ఉంటామని తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో 13 14 వార్డ్ మెంబర్లు మూలం నవ్యశ్రీ రెడ్డి, కోమరం సావిత్రి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పూల పెళ్లి సుధాకర్ రెడ్డి, హెచ్ఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దామెర ఆదినారాయణ, యువజన నాయకులు పోతిరెడ్డి అశోక్ రెడ్డి, శేషి రెడ్డి, మేకల శేషమ్మ, యేసు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *