32వ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 08 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి, ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దొబ్బల వేణుగోపాల్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమాన హక్కులు, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యమ ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బెక్కెం వెంకటేష్, మారంపెల్లి సాయికుమార్, లింగంపల్లి సుభాష్, లింగంపల్లి రాజేష్, లక్ష్మీనర్సయ్య, ధోనకంటి రాజేందర్, లింగంపల్లి గంగాధర్, అగ్గిమల్ల రాంప్రసాద్, సుంకే గంగరాజం, మారంపెల్లి గంగాధర్, బొమ్మేన ప్రకాష్, కండ్లపెల్లి శేఖర్, నల్ల నరేందర్ తదితరులు పాల్గొని ఎమ్మార్పీఎస్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఉద్యమ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *