క్రమశిక్షణ తో చదివితే ఉన్నత లక్ష్యాలు సాధిస్తారు.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 08 మామిడిపెల్లి లక్ష్మణ్ విద్యార్థులు క్రమశిక్షణ తో చదివితే ఉన్నత లక్ష్యాలు సాధిస్తారని యస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పడాల తిరుపతి తండ్రి పడాల భీమయ్య అన్నారు. రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో విద్యార్థులకు దాదాపు ఐదు వేల రూపాయల విలువైన నోట్ బుక్ లను మంగళవారం ఆయన పిల్లలకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువు వల్ల జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు.పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాల పూర్వ విద్యార్ధులు చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించారని వారిని స్ఫూర్తిగా తీసుకుని బాగా చదవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, చెరుకు మహేశ్వరశర్మ, జి.తరంగిణి, పి.రమేష్,రాజమహ్మద్ , యం.డి.సలీంతదితరులుపాల్గొన్నారు. అనంతరం భీమయ్య ను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *