పయనించే సూర్యడు జులై.04.2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ సూటి ప్రశ్న.ముసురు మిల్లి ప్రాజెక్టు కాలువకు పూడిక తీసి మరియు చెరువులకు కొత్త స్లూయిజ్లు,తూములు,కలవర్ట్లు ఏర్పాటుచేసి సాగునీరు అందించరా..? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తుంది.కానీ రైతులకు సాగునీరు అందించడంలోను మరియు అభివృద్ధి సంక్షేమం విషయంలోను క్షేత్ర స్థాయిలో పూర్తిగా విఫలమైందన్నారు.ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువకు పూడిక తీయడానికి డెబ్భై లక్షలు రూపాయలు మంజూరు చేసిందన్నారు.కానీ ముసురు మిల్లి ప్రాజెక్టు కాలువ చివరి వరకు పూడికతీత పనులు పూర్తిగా కాకపోవడంతో దేవారం, శరభ వరం గ్రామపంచాయతీల రైతులకు సాగునీరు అందని ద్రాక్ష మారిందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలకరి నాటికే చెరువులకు కొత్త స్లూయిజ్లు, తూములు, కలవర్ట్లు ఏర్పాటు.చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులతో పక్కాగా ప్రణాళికలు రూపొందించారు.కానీ నేటికీ చెరువులకు కొత్త స్లూయిజ్లు, తూములు, కలవర్ట్లు నిర్మించలేదన్నారు.మరోవైపు అధికారులు ప్రజా ప్రతినిధులు చెబుతున్న అభివృద్ధి మాటల్లోనే ఉంది.కానీ క్షేత్ర స్థాయిలో లేదని విమర్శించారు. ఈ సంవత్సరం కూడా రైతుల పంట భూములకు సాగునీరు అందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సిరి ధాన్యాలు కందులు, మినుములు, పెసర్లు, బొబ్బరులు, చోళ్ళు, గంటెలు, సామలు, జొన్నలు మొదలైనవి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సంబంధిత శాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువకు పూడికతీత పనులు మరల తిరిగి ప్రారంభించాలని మరియు చెరువులకు కొత్త స్లూయిజ్లు, తూములు, కలవర్ట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు, భారత్ ఆదివాసీ పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా ప్రసార కార్యదర్శి చవలం విద్యాసాగర్ మొదలైన వారు పాల్గొన్నారు.