పయనించె సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 8 గూడూరును జిల్లా చేయాలని గత 219 రోజులుగా గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు గూడూరు ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. 27 మండలాలు కలిగి ఉన్న మన గూడూరును 16 మండలాలు చేసారు 16 మండలాలను వై సి పి గవర్నమెంట్ లో 5 మండలాలుగా చేసారు ఇప్పుడున్న టీ డి పి గవర్నమెంట్ లో 3 మండలాలుగా చేసారు దక్షిణ కోస్తాలో ఉన్న గూడూరు ను రాయలసీమలో కలిపారు. గూడూరు జిల్లా చేయాలన్న విషయంపై సీఎం చంద్రబాబుకు విన్నవించేందుకు పున్నపు వారి పాలెం,వెళ్లిఅందుకు ప్రయత్నించిన తనను ,పోలీసులు అడ్డుకోవడం సరైన ది కాదని గూడూరు జిల్లా పోరాడు సమితి జేఏసీ అధ్యక్షులు భారత్ వికాస్ పరిషత్ సౌజన్య వైస్ ప్రసిడెంట్ కంకణాల పెంచలనాయుడు అన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ,ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జిల్లా గా ప్రకటించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం లో గూడూరు జిల్లా పోరాట సమితి (జె ఏ సి) అధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు యారం వెంకట, సుబ్బయ్య, మంజులమ్మ, శ్రీగౌరి, చిరంజీవి, ఉప్పు రాము, కనగలూరు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.