
పయనించే సూర్యుడు జులై :08 హుజరాబాద్ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : జడ్.పి.హెచ్.ఎస్ కోరపల్లి పాఠశాలను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుండి పాఠశాల ను సోషల్ ఆడిట్ కోసం జి రవీందర్ గారు పాఠశాలను సందర్శించినారు. వారి యొక్క నిబంధనల మేరకు పాఠశాల నిర్వహణలోని ప్రతి అంశాన్ని ప్రశ్నావళి రూపంలో అడిగి జవాబులను నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలలో ఉన్న తరగతి గదులు ఫర్నిచర్ , టాయిలెట్స్ అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరుగా ఉన్నాయా, లేదా.. రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ మరియు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రతి తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు ట్యూబ్ లైట్ ఎన్ని ఉన్నాయని నమోదు చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు ఆట స్థలము ప్లే గ్రౌండ్ అందుబాటులో ఉందా పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఉందా విద్యార్థులు లైబ్రరీ రూమును వాడుకుంటున్నారా ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగిస్తున్నాడా పాఠశాలల్లో ఉన్న ఐ. ఎఫ్. బి. ప్యానెల్ బోర్డ్స్ వాడడం జరుగుతుందా అందుబాటులో ఉన్న సైన్స్ లాబ్ ను గణితము కిట్ వినియోగిస్తున్నారా విద్యార్థులందరికీ హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఉన్నదా ఈ సమ్మర్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఎలక్షన్ డ్యూటీ చేసినారు దానితో పాటు సెన్సెస్ డ్యూటీ చేసినారని పరిశీలించడం జరిగింది. వారానికి ఎన్నిసార్లు మధ్యాహ్న భోజనంలో ఎగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు నెలకొక రోజు నో బ్యాగ్ డే నిర్వహిస్తున్నారు . పాఠశాలలో ఎన్ని రకాల క్లబ్స్ ఉన్నాయో పరిశీలించి వారు. కాన్షియన్స్ క్లబ్, లైబ్రరీ క్లబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లబ్, ఎకో క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ లను పరిశీలించడం జరిగింది. విద్యార్థులందరికీ పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇవ్వడం జరిగిందా అని ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వస్తుందా విద్యార్థుల యొక్క హాజరు శాతం ఎంత ఉంది. డ్రాప్ అవుట్ విద్యార్థులు ఉన్నారా, పాఠశాలలో గ్రీవెన్స్ బాక్సెస్ మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నాయా.. వీటన్నింటి పై పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు అందరితో వ్యక్తిగతంగా ప్రశ్నల ద్వారా సమాధానాలను రాబట్టినారు. ఏ.ఏ.పి.సి. చైర్పర్సన్ బండారి రజిత గారితో ప్రత్యక్షంగా మాట్లాడి కొన్ని సమాధానాలను తీసుకోవడం జరిగినది. పాఠశాల తల్లిదండ్రులైన వారితో కూడా మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రతి తరగతి నుంచి నలుగురు విద్యార్థులను ఇద్దరు అమ్మాయిలను ఇద్దరు అబ్బాయిలను తీసుకొని పాఠశాలకు సంబంధించిన మధ్యాహ్న భోజన విషయాలు మరియు ఇతర అన్ని అంశాలను వారి అభిప్రాయాలను క్రోడీకరించడం జరిగింది. ఈ విధంగా సెస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుండి వచ్చిన సోషల్ ఆడిటర్ గజ్జల రవీందర్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాల పరిసరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క పరిశీలనలను అన్నింటిని నమోదు చేసుకొని ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుందని తెలియచేసినారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలన్నీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా ఇంకా కావాల్సిన సౌకర్యాల రూపకల్పనకు ఇలాంటి పరిశీలనలు ఎంతగానో ఉపయోగపడతాయి. తద్వారా ప్రభుత్వం కచ్చితంగా అంచనా వేయడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాసరెడ్డి తెలియజేసినారు.