భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల శిక్షణ

పయనించే సూర్యుడు మే 20 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 కార్యక్రమంలో భాగంగా కర్నూలులో రెండు రోజుల పాటు జరుగుతున్న జిల్లా స్థాయి ప్రశిక్షణ కార్యక్రమంలో బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. పార్టీ అభివృద్ధి మరియు బూత్ స్థాయి బలోపేతం కోసం ఈ ప్రశిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ మరియు పట్టణ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *