ముందస్తు అరెస్టులతో గిరిజనుల ఉద్యమాలను ఆపలేరు

పయనించే సూర్యుడు మే 20 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ మోహన్ పవర్, నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గిరిజనుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మోహన్ పవర్‌ను ఈరోజు తెల్లవారుజామున మల్లేపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ పవర్ మాట్లాడుతూ, ముందస్తు అరెస్టులు చేసి గిరిజనుల ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్‌కు వెంటనే చైర్మన్‌ను ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బంజారా సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించబోమని మోహన్ పవర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *