రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుకార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 21 బుధవారం రోజున రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని వెల్లుళ్ల లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా.వై . స్వాతి మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్లో ఉన్న వరి రకాల సాగు పై,తక్కువ యూరియా వాడకం, పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నిర్దేశించిన పురుగు, తెగుళ్ల, కలుపు మందుల వాడకం లో, సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, పచ్చిరొట్ట పంటల సాగు, నేల ఆరోగ్యం ,అలాగే వరి పంట కోసిన తర్వాత పంట అవశేషాలు కాల్చకుండా నేలలో కలియదున్నటం వంటి వివిధ అంశాల పై రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. అదే విధంగా బి శ్రీలక్మి వాతావరణం ఆప్స్ గురించి, వాతావరణ బులెటిన్స్ గురించి వివరించారు.అలాగే ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎ. మమత వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమల గురించి మరియు యూరియా యాప్ గురించి, వచ్చే వానాకాలంలో తప్పనిసరిగా సన్నరకాలను సాగు చేయాలనీ రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,క్లస్టర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *