ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కిట్లు.గీతా కార్మికుల ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కి ట్లు ఎంతో ఉపయోగపడతాయని.

పయనించే సూర్యుడు న్యూస్:మే/23:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని రాజన్న సిరిసిల్ల. ఎక్సైజ్ సీఐ ఎం శ్రీనివాస్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట ఇల్లంతకుంట గీతా కార్మికులకు శుక్రవారం ఆయన కాటమయ్య రక్షణ కిట్లను అందజేసి మాట్లాడారు. గీతా కార్మికులకు ప్రమాదాల భారీ నుండి కాటమయ్య రక్షణ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కాటమయ్య రక్షణ కి ఏ విధంగా ఉపయోగించాలో గీతా కార్మికులకు శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. కాటమయ్య రక్షణ కిట్లు పొందిన గీతా కార్మికులు సద్వినియోగపరచుకొని ప్రమాదాల బారి నుండి కాపాడుకోవాలని సీఐ శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో ఎస్సై ప్రణీత్ గౌడ్, సంతోష్ ,కోమల, రమేష్ ప్రశాంత్, ఇల్లంతకుంట గౌడ సంఘం అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య, రహీంఖాన్ పేట గౌడ సంఘం అధ్యక్షుడు తిరుపతి గౌడ ,సంఘ సభ్యులు వెంకటేశం, అంతటి శ్రీనివాస్, ముంజ భాస్కర్ గౌడ్, కొయ్యడ చందు గౌడ్, పరుశరామ్ గౌడ్ ,మల్లేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *