హైబ్రిడ్ మహానాడు వర్చువల్ క్లస్టర్ సమావేశాలు

పయనించే సూర్యుడు న్యూస్, మే 28 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనలతో ఎన్ కన్వెన్షన్ హాల్లో హైబ్రిడ్ మహానాడు వర్చువల్ క్లస్టర్ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు మరియు ఎంపీపీ,క్లస్టర్-1 ఇంచార్జి గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, దివంగత వరుపుల రాజా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని బూత్ కమిటీ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, తెలుగు దేశం పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, అభిమానులు కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలనే సంకల్పంతో “కూడు,గూడు,గుడ్డ” నినాదంతో అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. అదే ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని, కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 ఇంచార్జి ధనేకుల భద్రరావు, కో కన్వీనర్లు బస్సా మహాలక్ష్మి ప్రసాద్, కోరుకొండ నూకరాజు, మండల తెలుగు యువత పెంటకోట శ్రీధర్, నాయకులు సూతి బూరయ్య, పసల సూరిబాబు, చిక్కాల లక్ష్మణరావు, బుద్ద సూర్య ప్రకాష్, బుద్ద ఈశ్వరరావు, సూతి వీర ప్రభాకర్, మైరాల కనకారావు, జిగటాపు సూరిబాబు, అరక రాజు, నూకతాటి ఈశ్వరుడు పాల్గొన్నార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *