పెద్ది సినిమాకు వెళుతూ రోడ్డు ప్రమాదం స్వల్ప గాయాలు

పయనించే సూర్యుడు జూన్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన కారు బోల్తా పడింది. కారులో ఉండే ఆరు మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.. సంఘటన జరిగిన వెంటనే ఆత్మకూరు సిఐ గంగాధర్ తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనంలో ప్రయాణిస్తున్న వీరు మర్రిపాడు లో నివసిస్తున్నారు. మర్రిపాడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా పక్కపక్క ఇళ్లకు చెందిన వీళ్లు ఆత్మకూరులోని రామకృష్ణ థియేటర్లో రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా చూసేందుకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది..కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఈ విధంగా.. ప్రమాదానికి గురైన కారు కిరణ్ కుమార్ నడుపుతూ ఉండగా ఈ వాహనంలో కిరణ్ కుమార్ మరియు ఇతని భార్య యామిని వీరి కుమారుడు దిలీప్ తో పాటు వీరి పక్కనే నివసించే కల్పన మరియు కల్పన పిల్లలైనా దీక్షిత్, చరణ్ లు కారులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *