విజయవంతమైన 16 వ వార్డ్ సభ, ముఖ్య అతిధిగా మున్సిపల్ కమిషనర్

పయనించే సూర్యుడు జూన్ 8/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజులు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్లూరు మున్సిపాలిటీ 16వ వార్డు సభ కల్లూరు అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కౌన్సిలర్ ఉబ్బన రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా కల్లూరు మున్సిపల్ కమిషనర్ ఎం రామచంద్రరావు పాల్గొనగ ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధాప్య పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ సమస్యలు కౌన్సిలర్,కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వాటిని అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, మున్సిపాలిటీ బిల్ కలెక్టర్, మెప్మా, అంగన్వాడి,ఆశ సిబ్బంది, మరియు అధిక సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *