ఈనెల 15న సాయి గార్డెన్ లో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళన సభ…

* జిల్లాలోని దివ్యాంగులు హాజరు కావాలి... * దివ్యాంగుల సమితి జిల్లా అధ్యక్షులు ఎన్.శ్రీశైలం.

పయనించే సూర్యుడు జూన్ 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల సాయి గార్డెన్ లో ఈ నెల 15న సోమవారం నాడు ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తున్నట్లు నాగర్కర్నూల్ దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు నరందాస్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి మొల్గర పరుశరాములు లు తెలిపారు. ఈ ఆత్మీయ దివ్యాంగుల సమ్మేళనానికి రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరై దివ్యాంగుల సమస్యలపై మాట్లాడనున్నారని వారు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని తాలూకా, మండల, గ్రామస్థాయిలోని ప్రతి దివ్యాంగుడు సభలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో దివ్యాంగుల సమస్యలపై మండలం వారీగా సమీక్ష నిర్వహించి దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల న్యాయమైన కోరికలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. హాజరయ్యే దివ్యాంగులు మరిన్ని వివరాలకు అధ్యక్షులు సెల్ 9885829837, ప్రధాన కార్యదర్శి సెల్ 9010717322లలో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *