పయనించే సూర్యుడు.. న్యూస్..07 భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివ్వాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు, ఈ సందర్బంగా అనంతు ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ స్థాపకుడు, గొప్ప దేశభక్తుడు మరియు విద్యావేత్త అయిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి జరుపుకోవడం అదృష్టం అని అన్నారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కేవలం 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టి, విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, బెంగాల్ విభజన నిరోధ ముస్లిం లీగ్ బెంగాల్ మొత్తాన్ని పాకిస్తాన్‌లో కలపాలని చూసినప్పుడు హిందూ మహాసభ నాయకుడిగా ఆయన తీవ్రంగా పోరాడారని,ఫలితంగా పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉండిపోయిందని అన్నారు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గంలో ఆయన పరిశ్రమలు మరియు సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారని . భారతదేశ పారిశ్రామిక విధానానికి ఆయన బలమైన పునాది వేశారని, 1950లో పాకిస్తాన్‌లోని మైనారిటీల అయిన హిందువుల హక్కులను రక్షించడంలో నెహ్రూ ప్రభుత్వం విఫలమైందని భావించి, నెహ్రూ-లియాఖత్ ఒప్పందానికి నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారని, స్వాతంత్ర్య భారతదేశంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఆయనేనని అన్నారు మంత్రి పదవి వీడిన తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మ ద్దతుతో 1951 అక్టోబర్ 21న “భారతీయ జనసంఘ్” రాజకీయ పార్టీని స్థాపించారని ఇదే పార్టీ కాలక్రమేణా నేటి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అన్నారు ఒకే దేశం – ఒకే చట్టం: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని “ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే” అని ఆయన గర్జించారు. అప్పట్లో భారతీయులు కాశ్మీర్‌లోకి ప్రవేశించాలంటే అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని,దీనిని నిరసిస్తూ 1953 మే నెలలో ఆయన పర్మిట్ లేకుండానే కాశ్మీర్‌లో అడుగుపెట్టారని అక్కడ ఆయనను అరెస్ట్ చేసి జైలులో ఉంచారని జైలులో ఉన్న సమయంలోనే 1953 జూన్ 23న ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారని భారతదేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన అపర దేశభక్తుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని నేడు దేశవ్యాప్తంగా ఆయన జయంతిని పురస్కరించుకుని నివాళులు జరుపుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు భవనాసి దుర్గారావు,మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు, ఉపాధ్యక్షులు పురాణం దివాకర్, కొండా హర్షవర్ధన్, మండల నాయకులు సూరెపల్లి జ్ఞానరత్నం,షేక్ షర్ఫుద్దీన్, సయ్యద్ మోహినూద్దీన్,గెల్లా చక్రపాణి ఎలిగేటి గిరి, పుట్టా సత్యనారాయణ, పిట్టల సూరిబాబు,తేజవత్ నాగరాజు, కాళంగి వెంకటేశ్వర్లు, గెల్లా నాగసాయి, బానోత్ శ్రీనివాసరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు