
పయనించే సూర్యుడు న్యూస్, నవంబర్ 3, తల్లాడ, జర్నలిస్ట్ బాబురావు ప్రభుత్వం తెలంగాణ రెండవ పిఆర్సీ అమలుపై విపరీతమైన కాలయాపన చేస్తుందని, వెంటనే పిఆర్సి అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బాలభారతి పాఠశాల నందు జరిగిన మండల 13వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సీ ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగ ,ఉపాధ్యాయ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అసంతృప్తి తొలగాలంటే పిఆర్సీని వెంటనే ప్రకటించడం మినహా ప్రభుత్వము దగ్గర వేరే దారి లేదని తెలియజేశారు. 40 నెలల కాలంగా ఆలస్యమైన పిఆర్సీి గతంలో ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తుందని, ఉద్యోగులు సమాజంలో భాగం అని గ్రహించాలని హితవు పలికారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో ఇదే విధమైన కాలయాపన చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఎదుర్కొంటుందని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే పిఆర్సీని ప్రకటించడంతోపాటు, సిపిఎస్ రద్దు చేయడం, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిర్ణీత కాలపట్టిక రూపొందించాలని డిమాండ్ చేశారు. అలాగే టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. యాప్ ల భారం తగ్గించి, ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని కోరారు. ఈ మహాసభకు షేక్ లాల్ సయ్యద్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస రావు, ఇందుప్రియ, షేక్ రఫీ, ప్రగతి కుమారి, ఎం.వి.చెన్నారావు, జి.ఎన్ మురళీకృష్ణ, కే.రాధ,కే. వెంకటేశ్వర్లు,ఎస్. రామారావు,బి. వెంకటేశ్వరరావు, బి.కోటేశ్వరరావు, పి. రామకృష్ణస్వామి,ఎం. స్వరాజ్యలక్ష్మి,సిహెచ్. గిరిజా రాణి,టి.పద్మ,కే. సంధ్యారాణి,ఎం.సునీత, బీవీ.రామారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందుగా ఉద్యమ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.టీఎస్ యుటిఎఫ్ తల్లాడ మండలం నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా షేక్ లాల్ సయ్యద్, ప్రధాన కార్యదర్శిగా జే వీ కిషోర్, ఉపాధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాసరావు,బి దుప్రియ,కార్యదర్శులు జి ప్రగతి కుమారి, ఈ సైదులు, షేక్ తస్రునిసా బేగం, పీ రామకృష్ణ స్వామి, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ జి ఎన్ మురళీకృష్ణ, మండల ఆడిటర్ షేక్ రఫీ,మండల కమిటీ ఎన్నిక జరిగింది జరిగింది.

