
పయనించే సూర్యుడు నవంబర్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) అభివృద్ధికి ఓటెయ్యండి జడ్పిటిసిగా పిల్లి అనంతలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అంటూ సర్పవరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దళితపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండి అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకి అలాగే ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం టిడిపి సీనియర్ నాయకులు వివై దాసు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా అలాగే జడ్పిటిసి గా చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి బలపరిచిన జడ్పిటిసి అభ్యర్థిని పిల్లి అనంతలక్ష్మికి ఓట్లు వేసి భారీ మెదక్ తో గెలిపించాలని తెలియజేశారు. ఈ భారీ ర్యాలీలో కూటమి నాయకులు కర్రీ వెంకటరాజు, పుల్ల ప్రభాకర్ రావు,పుల్ల చందు, కర్రీ శ్రీను, పలివెల త్రిమూర్తులు, రాయుడు అనిల్, మాజీ సర్పంచ్ చిన్న, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు మరియు గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
