భవిష్యత్ కోసం ఒక మొక్క – పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందాని బిజెపి ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డితో కలసి మొక్కలు నాటారు. అంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భవిష్యత్ కోసం అమ్మ పేరుతో ఒక మొక్క” అనే కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచారాని గుర్తు చేశారు. ఒక మొక్క నాటడం అంటే కేవలం చెట్టును పెంచడం మాత్రమే కాదు, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం మరియు పచ్చని ప్రకృతిని అందించడంతో పాటు చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను వి డుదల చేయడం ద్వారా భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ఇంటి వద్ద, పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దడం కూడా అత్యంత అవసరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *