18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

'గొడుగుపల్లి గ్రామంలో ఓటరు అవగాహన కార్యక్రమం"

పయనించేసూర్యుడు జులై 10 రాజేష్) గొడుగుపల్లి గ్రామంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ జహీర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తమ బాధ్యతగా ఓటు వేయాలని వారు తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు అవసరమైన వారు సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ రేఖ, ఎఫ్ఏ దుర్గాని శ్రీనివాస్, సీఏ సౌజన్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *