పయనిం చేసూర్యుడు..న్యూస్..09 సీనియర్ నాయకులు బవనాసి దుర్గారావు ఇంట్లో SIR పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నకిరికంటి వీరభద్రం అధ్యక్షతన మండల నాయకులు, శక్తికేంద్ర ఇంచార్జ్ లకు పాలేరు నియోజకవర్గ SIR కార్యశాల జరిగింది, ఈ కార్యశాల ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా నంబూరి రామలింగేశ్వరరావు గారు మాట్లాడుతూ SIR పై బూత్ స్థాయిలో ప్రతి బీజేపీ కార్యకర్త అవగాహనా ఉండేటట్లు ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలని కోరారు, అంతేకాక ప్రతిపక్షాలు కెంద్ర ప్రభుత్వం ఓట్లు తొలిగిస్తుందని చేస్తున్న విష ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, వాస్తవానికి SIR అనేది ప్రతీ 12 సంవత్సరాల ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచే ప్రక్రియ అని, గతంలో 2002 లో SIR ప్రక్రియ జరిగింది అని దాని తర్వాత నడుస్తున్న ఓటు ప్రక్షాళన జరుగుతుంది ఈ నెల 24 వ తారీకు వరకు SIR ప్రక్రియ నడుస్తుందని అన్నారు,బూత్ స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్ లు అధికారుల తో సమన్వయము చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో SIR జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్ జిల్లా కోశాధికారి కొన్నతం లక్ష్మీనారాయణ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ రూరల్ మండల అధ్యక్షుడు జాటోత్ మధు పాలేర్ టోలి అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు SIR మండల కన్వీనర్లు మల్లెబోయిన గోవిందరావు,నల్లమాస శ్రీనివాస్ ,లంకపల్లి సాగర్ ,శంకర్ నల్లగట్టు శ్రీనివాస్, మహేందర్, నరేష్, ఉపేందర్, హీరా లాల్ నేలకొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి బాజా రామకృష్ణ, ఉపాధ్యక్షులు పురాణం దివాకర్, కొండా హర్షవర్ధన్, మండల నాయకులు సయ్యద్ మోహినూద్దీన్, పుట్టా సత్యనారాయణ, గెల్లా చక్రపాణి, కందరబోయిన గోపి, జెల్లా సురేష్, పోతనబోయిన శేషగిరి, లింగనబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు