
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 10 పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా అనిగండ్లపాడు గ్రామం లో 1.పంచాయతీ కార్యాలయం వద్ద,2.బైపాస్ రోడ్డు లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద,3.మెయిన్ రోడ్డు లోని మంగినేని బాబు ఇంటి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద,4.ఎస్సీ కాలనీ లోని జండా చెట్టు సెంటర్ వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచాయని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నం శ్రీనివాస్ రావు ,జిల్లా పార్టీ ఉప అధ్యక్షులు కొత్తపల్లి పెంటయ్య ,మండల రైతు విభాగం అధ్యక్షులు పిడికిటి కోటేశ్వరావు ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు కనకపూడి భాస్కరరావు ,గ్రామ సీనియర్ నాయకులు వుట్ల లక్ష్మయ్య ,గింజుపల్లి కోటేశ్వరరావు ,పాలాది వెంకటరమణ మరియు గ్రామ ముఖ్య నాయకులు,మహిళలు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.

