శారీరక దృఢత్వం యువతకు అవసరం:

అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు. డాక్టర్ హేమంత్ న్యూరో ఫిజీషియన్

పయనించే సూర్యుడు మే 23 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ విద్యార్థులకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో 60 స్పోర్ట్స్ ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలని, యువత దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి, ఎండల తీవ్రత నేపథ్యంలో ఎక్కువగా తాగునీరు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ త్రినాథ్, డాక్టర్ వివేక్, చంద్రపాల్ రెడ్డి, కోచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *