ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం

జనం న్యూస్, జూన్07 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ శుక్రవారం ఘనంగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ రూప కుమార్, ఎకో క్లబ్ హెడ్ డాక్టర్ వి. చందిని భాను ఆధ్వర్యంలో ఎకో క్లబ్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. నాగజ్యోతి విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, సృజనాత్మకత, సామాజిక బాధ్యత పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ కాసర్ డా. రామ్‌గోపాల్ మోపురి, డీన్ అకాడమిక్స్ డా. రూప కుమార్, డీన్ సామ్స్ డా. తిరులోగసుందరం పాల్గొని విజేతలను అభినందించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సుస్థిర అభివృద్ధి కోసం విద్యార్థులు తమ వంతు కృషి కొనసాగించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఎకో క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులను యూనివర్సిటీ ఛైర్మన్ భరత్‌లాల్ మీనా, ఛాన్సలర్ డా. రూప వాసుదేవన్ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో ముందుకు సాగాలని సంకల్పంతో కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *