పయనించే సూర్యుడు, జూలై 10 అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ భవనం అప్పటి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మాత్యులు శ్రీ జలగం వెంగళరావు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో సుమారు యాభై ఆరు సంవత్సరాల క్రితం అప్పటి గ్రామ జనాభా ప్రకారం చిన్న చిన్న గదులతో బిల్డింగును నిర్మించడం జరిగినది అని అశ్వాపురం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పదహారు మంది, కో ఆప్షన్ సభ్యులు ముగ్గురు, ఎంపీటీసీలు నలుగురు, ఒక ఎంపీపీ, ఒక జెడ్ పి టి సి మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ లు సమావేశమగుటకు సరిపోవటం లేదు అని ఇప్పుడున్న గ్రామపంచాయతీ భవనము నూటయాభై గజాలలో నిర్మించి ఉండటం వలన స్థలాభావం వలన గ్రామ గ్రామసభ సాధారణ సమావేశం ఆరు బయట చెట్ల కింద రోడ్ల పక్కన ప్రజలు నిలబడాల్సి వస్తున్నది అని గ్రామ పంచాయితీ భవనాన్ని మూడుసార్లు మరమ్మతులు చేయించినా సిమెంటు పెచ్చులు ఊడి మనుషుల మీద పడుచున్నవి వరుసగా నాలుగైదు రోజులు వర్షం కురిసినట్లయితే కూలి పోయే ప్రమాదం ఉన్నది అని సున్నం బస్తాలు బ్లీచింగ్ పౌడర్ నిలువ చేసే గది గోడలు పగుళ్లు ఏర్పడి వర్షపు నీరు లోపటికి వెళ్ళుచున్నవి అని రెండువేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదమూడు వేల ఐదు వందల మంది ప్రజలు ఉండేవారు అని ప్రస్తుతం జనాభా సుమారు ఇరవై వేల మంది పైనే ఉంటారు అని ట్రాక్టరు, నీళ్ల ట్యాంకరు వీటిని రోడ్డు పక్కన పెట్టడం మూలాన భద్రత లేకుండా పోతున్నది అని పంచాయితీలో పారిశుద్ధ్య కార్మికులు ఇరవై ఒక్క మంది వీరు కూర్చోవడానికి కూడా స్థలం లేకపోవడంతో వచ్చిపోయే ప్రజల వాహనాల పార్కింగ్ స్థలం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడు తున్నారు అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ భవనము నిర్మించుటకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల వవివరాలు డిపిఓ కి తెలియపరచడం జరిగింది ఆర్ అండ్ బి ఆఫీస్ పక్కన రెండున్నర ఎకరాల ఖాళీ స్థలం, ఆర్టీసి శాఖ వారి మూడు యకరాల స్తలం, వెటర్నరీ హాస్పిటల్ దగ్గర సుమారు పది కుంటల ఖాళీ స్థలం, ఆయుర్వేదిక్ హాస్పిటల్ దగ్గర సుమారు ఆరు కుంటల ఖాళీ స్థలంలను వివరించగా డిపిఓ స్పందిస్తూ గ్రామ పంచాయతీని సందర్శించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.