జాతీయ పునర్నిర్మాణం ఏబీవీపీ లక్ష్యం.

- ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభిలాష్.

పయనించే సూర్యుడు జులై :10 హుజురాబాద్ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా నగరంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించటం.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అభిలాష్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని 5 మంది విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటాక్ నుంచి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వం తో ప్రపంచములోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని ఎబివిపి నినాదాలు నేడు దేశానికి విధానాలుగా మారాయిఅని, కాశ్మీర్ ఆర్టికల్ 360 రద్దు కై నినదించి ఉద్యమించి విజయం సాధించిన ఘనత ఎబివిపి దని, అక్రమ వలసదారుల ఏరివేతకు సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో అని అక్రమ వలసదారుల వల్ల ఏర్పడే జాతీయ భద్రత విషయంలో ఎబివిపి చేసిన ఉద్యమాలు నేడు ఈశాన్య రాష్ట్రాలు భారత్ తో బలంగా నిలుచుటకు ఆధారం అయిందని, తెలంగాణ, బెంగాల్, కేరళ మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వామపక్ష విదేశీ కుట్రలను, నరహంతక నక్సలైట్ల తూటాలకు ఎదురించి, జాతీయ వాదాన్ని పెంపొందించటానికి భారత్ మాతాకి జై అంటూ అనేక మంది ఎబివిపి కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని, అటువంటి మహా వీరులు పుట్టిన గడ్డ తెలంగాణ. జాతీయ వాదాన్ని దేశభక్తిని విద్యార్థులను తెలియచేయడంలో ఎబివిపి కార్యకర్తలు నిరంతరం పనిచేస్తూ వస్తున్నారు. నేడు ఇక్కడ కాగడా జండా పట్టుకొని భారత్ మాతాకి జై అని నినదిస్తున్న ఈ వేలాదిగా విచ్చేసిన విద్యార్థుల సంఖ్య వారి ఉచ్చాహం సాక్ష్యం అని వామపక్ష వాదుల వ్యక్తి నిర్మూల సిద్ధతం నేడు భారత పటంలో శాశ్వతంగా నిర్మూలింపబడిందని, జాతీయవాద వ్యక్తి నిర్మాణ సిద్ధాంతం పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో విస్తరించిందని అన్నారు, భారత దేశంను ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిలుపుటకు ఎబివిపి 78 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎబివిపి నగర సంయుక్త కార్యదర్శి సాయి చరణ్, అజయ్ నగర ఉపాధ్యక్షులు రాజు, ఆదిత్య , మనీ ప్రీతం, రామ్ చరణ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *