సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి… సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్

పయనించే సూర్యుడు జులై 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: రేపల్లెవాడ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామస్తులకు రెండు, మూడు రోజుల పాటు జ్వరం, జలుబు ఉంటే తప్పనిసరిగా పీహెచ్‌సీని సందర్శించాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలి ప్రజల భాగస్వామ్యంతోనే సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జ్వరం, జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించు కోవాలని తెలిపారు. స్వీయ చికిత్సకు పాల్పడకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధులు తీవ్రం కాకుండా నివారించవచ్చని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అజ్మీర సురేష్ నాయక్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితులను పూర్తిగా నివారించాలని, నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *